Wednesday, February 9, 2022

మన నీరాజనం ..

 

 


 

 

 

 

 

 

అవి .. కేవలం పాటలు కావేమో...!! -

|  తొలకరి చినుకులు

మది పుడమి పైని
సువాసనల అత్తరులు

కవి భావుకతను కళ్ళముందు
సృజియించే ఛాయా చిత్రాలు |


|| కావు .. అవి కేవలం పా..టలు ||


| అవి .. సజీవంగా విని ...
సగర్వంగా చెప్పుకోగలిగిన
సమకాలీనులు -

ఆ స్వరామృత  బిందువులను
ఆస్వాదించే అజరామరు
లు -

..
అందరి తరపున నా నీరాజనాలు |

 

Thursday, October 4, 2012

అంతిమం


ఒక్కొక్కటిగా
అదృశ్యమవుతున్నాయ్ ..... !!?

ఒడిసి పట్టుకుని -
జ్ఞాపకాలలో నిక్షిప్తం చేయడానికైనా ..
మిగులుతారా .. ఎవరైనా ?

Monday, May 21, 2012

గాలి పటం




 రంగు రంగుల నిన్నటి నుండి ..
మున్ముందుకు -
అలా చీకటి నీడల్లోకా ... !!?
కలల గగనానికా? ...

 ఆస్వాదించలేక
కాలాన్ని తిడదామా ?

 ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టి -
పరుసవేది విద్య నేర్చిన
నేర్పరులమవుదామా ? ?
 
- చంద్రశేఖర్

Wednesday, December 7, 2011

అలా..


ళ్ళ ముందు ఎగసే -
ఉదయాలు
ఆవెనక క్రుంగే
సాయంత్రాలు
ఏ చేతుల్లో ఇమడని
సంతోషాలు
విషాదాలూ ..
బ్రతుకు చిత్రంలో
వర్ణ మిశ్రమాలు 

Friday, April 25, 2008

.. భ్రమణం ..


గుండెలో భావాన్ని 

బయటకు తీయబొతే - 

బరువుగా ..  

రాలేదు గాని 

దాని ప్రతిరూపం, 

భాషలేని ఏదో నీటి తెరగా 

కన్రెప్పల్లొ తేలింది

Thursday, February 14, 2008

ఉవాచ (వేలెంటైన్ డే కోట్)



అమ్మాయిలను

చుడడం వరకూ ఫర్వాలేదు

గాని,

చూపులు -

ఎదురు చూపులుగా

మారితేనే ప్రమాదం !!

అతడు - ఆమె



కనులు కనులను కలుస్తాయి..
మౌనంగా
మోహనంగా..!
భువిలో మాట్లాడని భాషని
మూగగా మాట్లాడుకుంటూ..,
పండిన పనసకాయలాంటి
పరిమళమేదో చుట్టుముడుతుండగ ..
వింతయై కవ్వింతగా
తమకు తెలియని భావమేదో
దాక్కునుందని
పరువపు పరదాల చాటునుంచి
హేమంత పవనాల
రాయభారం నెరపుచూ ..

భువిపై -
అనంద సామ్రాజ్యపు
నేతలిరువు ఎదురైనట్లు
గంభీరంగా..
చిలిపిగా..,
అంతలొనే తత్తరపడుచు మార్చే చూపులు -
ప్రణయ సమ్రాజ్య స్థాపనకునంది పలుకుచు ..
సమీరాల చాటుగ
కరములు కలిపి ..
స్వప్న వసంతాలు పూయగ ..
అతడు - ఆమె !!

Thursday, February 7, 2008

ఓటమి



గుండె చప్పుడుకు కర్ఫ్యూ విధించాలని
ఎర్ర సైన్యం - మనసు గోతుల్లోంచి
గొంతు లోయల్లోంచి అరుస్తోంది

ఆవేశంతో పెగలే గొంతును
ఖాకీల రూపం కోసేసింది

బిగిసిన కండకు
పిచ్చోళ్ళ అధికారం బల్లెపు పోటు పొడిచింది

ముందుకు నడిపించే గుండెని
స్వంతవాళ్ళ స్వార్ధం చిల్లులు చేసింది

ప్రతిచోటా - అన్యాయం
నా వెన్ను విరగ్గొట్టాలని చూస్తోంది

నా ఒక్కడి శక్తీ ..
స్రవిస్తూ ఇగిరిపొతోంది

అలోచనలకు మతిమరుపొస్తోంది
అలసిపోతున్నాను

ఎదురు తిరిగే చేవ చచ్చింది
అందుకే అంటున్నా -
గుండే ..! కసేపాగిపో........

Wednesday, February 6, 2008

నువ్వక్కడున్నా ..

నువ్వు అక్కడున్నావ్

నీ జ్ఞాపకం ఇక్కడుంది -

నాలో నిలువెత్తున అల్లుకుని

ఈ పరిసరల్లో దాక్కుని

నిశ్శబ్ధంలోనూ

నిర్ణిద్రలోనూ

కలకలం రేపుతూ ..

నాలో .. నా ఆలోచనల్లో

ఇంకా .. అంతఃచేతనలో

అనంత వ్యాప్తమై -- !

(10:25pm 6/10/2003)

Friday, January 25, 2008

అర్ధనారీశ్వరుడు


<నెలకు 27 రోజులు>


.. మెరుపులు ..


పడమటి జ్ఞాపకం


కార్గిల్


ఫ్రణయం


నృత్యం




సుప్రభాతం


Someకీర్తన


వృత్తం


వాడి


శివరంజని


నిర్వచనం


స్వపర్వం


తరంగాలు


నిశ్వాస


గరిమనాభి